102

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మమున్ సృజించిన దేవుండు ప్రాణము నొసంగి యెప్పుడు కాపాడు మమ్మును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుడాయనన్.పలువిధాలుగ బాధించు రోగముల్ పోగొట్టి మీదకు రాకుండ జేసెను సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండు డాయనన్.దేవుండు మాత్రమే రక్షణ మార్గము ఆయత్తపఱచి చూపించె మాకును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండు డాయనన్.మా నిత్యబాధలు వారించుకొరకు దా సొంత పుత్రుని పంపెన్ సుప్రేమతో సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండు డాయనన్.ఆనంద మొందుడి శ్రీ యేసు మోక్షము స్వసేవకాళికి అనుగ్రహించును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండు డాయనన్.

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment